Thursday, April 25, 2024
- Advertisement -

ముక్కు మూసుకొని తినాలంటూ కన్నీళ్లు పెట్టించిన నూకరాజు!

- Advertisement -

సాధారణంగా కమెడియన్ అంటే నాలుగు పంచ్ డైలాగులు వేసే అందరినీ నవ్విస్తూ ఉంటారని భావిస్తారు. కానీవారు కూడా ఏడిపించగలరని ఇప్పటికే ఎంతో మంది కమెడియన్లు నిరూపించుకున్నారు. తాజాగా కామెడీ నూకరాజు ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీలో భాగంగా చేసిన స్కిట్ అందరినీ ఎంతగానో కదిలించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ స్కిట్ లో భాగంగా నూకరాజు పారిశుద్ధ్య కార్మికుడిగా కనిపించి వాళ్ళు పడే భాదను,అవమానాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అమ్మ నాకు గవర్నమెంట్ జాబు వచ్చింది అమ్మా అంటూ పారిశుద్ధ్య కార్మికుడి డ్రైనేజీలో దిగి మురుగును తీసేయడం, ముక్కు మూసుకొని అన్నం తినే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. నేను పక్కన ఉంటేనే కంపు భరించలేకపోతున్నారు అలాంటిది 12 గంటలపాటు ఆ కంపులోనే ఉండాలి అంటూ ఎత్త భావోద్వేగమై చేసిన ఈ స్కిట్ ఎంతగానో ఆకట్టుకుంది.

Also read:ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఈ విధంగా నూకరాజు పారిశుద్ధ్య కార్మికుడిగా చేసిన స్కిట్ లో నటించడం కాకుండా జీవించాడు. ప్రస్తుతం ఈ స్కిట్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో మరింత ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -