మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య సినిమా ఇది వరకు మేకర్స్ ప్రకటించిన డేట్ ప్రకారం మే లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 25 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందని సమాచారం. మెజారిటీ భాగం రామ్ చరణ్ పైనే సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

- Advertisement -

లాక్ డౌన్ ముగిసి షూటింగ్ లకు అనుమతి రాగానే మిగిలిన భాగాన్ని చిత్రీకరించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కు అనుమతి రావడానికి, పెండింగ్ వర్క్ పూర్తి చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆచార్యను దసరా సీజన్ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ జూలైలో విడుదల కావాల్సి ఉండగా ఆ సినిమా చిత్రీకరణ కూడా కరోనాతో ఆగిపోయింది. దీంతో ఈ సినిమాను కూడా దసరా రేసులో నిలపాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఆచార్య, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద బలపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓటమి ఎరుగని కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య, పాన్ ఇండియా కేటగిరిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ ఒకేసారి విడుదల అవుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

Also Read: టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -