Tuesday, April 30, 2024
- Advertisement -

భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

- Advertisement -

తన అంద చందాలతో నటనా నైపుణ్యంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి స్టార్ డింపుల్ కపాడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటనపై ఆసక్తి ఉండడంతో బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో  రిషీ కపూర్‌‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌ అరంగ్రేటం చేశారు. నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాకుండా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకొని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

డింపుల్ కపాడియా నటించిన మొదటి సినిమాకి ఫిలింఫేర్ అవార్డు రావడంతో తన తర్వాత సినిమా “రుడాలిలో” నటించి మరోసారి విజయం దక్కించుకోవడంతో ఈమె జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలబడింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రెండు సినిమాలకి ఇంత పాపులారిటీని సంపాదించుకున్న సమయంలో ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.

Also read:రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

ఈ విధంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న డింపుల్ కపాడియా అంద చందాలు, నటనా నైపుణ్యంతో ఆ నోటా ఈ నోటా పాకడంతో చివరకు సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే తనకన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్దవాడు అయినా రాజేష్ ఖన్నాను వివాహమాడింది. తరువాత డింపుల్ కపాడియాకు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి బంధం లో కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

Also read:కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

ఈ విధంగా ఎటువంటి విడాకులు తీసుకోకుండా విడిపోయిన ఈ జంట తరచు ఎక్కడ కలిసిన ఎంతో సరదాగా సన్నిహితంగా మాట్లాడుకునే వారు.ఒకసారి రాజేష్ కన్నా ఆరోగ్యం బాగా లేనప్పుడు డింపుల్ కపాడియా దగ్గరుండి అతనికి సేవలు చేసింది. ఈ క్రమంలోనే రాజేష్ తో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్ కు సన్నీ డియోల్‌ మంచి సోల్‌మేట్‌ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వీరి ప్రేమ గురించి తెలిసిన సన్నీ భార్య పూజ ఈమెతో గొడవ పడటంతో డింపుల్ పూజకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరింది. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో సన్నీ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో కలత చెందిన డింపుల్ కూడా తన భర్త రాజేష్ కన్నాకు విడాకులు ఇవ్వకుండా చివరి వరకు తనకు భార్యగానే డింపుల్ సపరిచర్యలు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -