దర్శకరత్న దాసరి నారాయణరావు గారు.. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను సినీ పరిశ్రమకు కానుకగా అందించారు. అంతటి దిగ్గజ దర్శకుడు.. జీవిత చరమాంకంలో.. తీయాలనుకున్న 2 సినిమాలను.. ఇంకా చెప్పాలంటే.. దాసరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన ఆ రెండు సినిమాలు.. వాస్తవ రూపం దాల్చి ఉంటి.. సంచలనాలు సృష్టించేవే.
ఈ మధ్యే.. ఆనారోగ్యంతో కారణంగా చనిపోయిన జయలలిత గురించి.. దాసరి ఓ సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ.. ఎందుకో అది కుదరలేదు. మరో మెగా ప్రాజెక్ట్.. ప్రతి పాదనల దశలోనే సంచనాలు సృష్టించిన ప్రాజెక్ట్ కు కూడా దాసరి శ్రీకారం చుట్టారు. పని కూడా స్టార్ట్ చేశారు. తెలుగు సినిమాలో టాప్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని.. అది తన నిర్మాణంలో రావాలని దాసరి చాలానే ప్రయత్నించారు. మూవీ చేయబోతున్నట్లు అఫిషియల్ గా కూడా ప్రకటించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అంతటితో ఆగకుండా.. తమిళ్ లో అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివతో.. ఈ సినిమాకు డైరెక్ట్ చేయించాలని ప్లాన్ కూడా చేశారు. అంతేకాకుండా శివకు అడ్వాన్స్ కూడా ఇచ్చిన దాసరి.. పవన్ దగ్గరికి తీసుకెళ్లి మరీ స్టోరీ వినిపించారనీ.. కానీ పవన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనీ తెలిసింది. అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో తనకు పవన్ నుంచి డేట్స్ లభిస్తాయని ఇన్నాళ్లూ దాసరి నమ్మకంతో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతలోనే దాసరి నారాయణరావు కన్నూమూయడం.. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
{youtube}dl4BmiI7qX4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related