ఈ మద్య సోషల్ మీడియాలో అసలు వార్తల కన్నా అసత్య వార్తలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఈ రూమర్లు తలనొప్పిగా మారాయి. సోషల్ మీడియా వలన ప్రజలకు చాలా మంచే జరుగుతున్నప్పటికీ, కొందరు దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు.
ఫేక్ ఫేస్ బుక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. అది నిజమేనని నమ్ముతోన్న చాలామంది నెటిజన్లు గొప్ప హాస్యనటుడిని కోల్పోయామంటూ సంతాపం తెలుపుతున్నారు. అది నకిలీ ఫేస్‌బుక్ ఖాతా అని తెలియక చాలా మంది అందులోని వార్తను నమ్ముతున్నారు. దీంతో ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్ చేశారు.
మిస్టర్ బీన్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు ఆయన చావుపై ఫేక్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!