Friday, April 19, 2024
- Advertisement -

మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

- Advertisement -

యువ గాయకుడిగా, నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నోయల్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. సింగర్ నోయల్ హీరోయిన్‌ ఎస్తర్‌తో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2019 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి వివాహం చేసుకున్న కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా నోయల్ విడాకులు తీసుకున్న తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా షోలో పాల్గొన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నోయల్ అనారోగ్య కారణం వల్ల మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు. హౌస్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.ఈ విధంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన నోయల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Also read:జిమ్ వేర్ ఘాటుగా అందాలను ఆరబోసిన చందమామ.. ఫోటో వైరల్!

తాజాగా నోయల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా’అంటూ ట్వీట్ చేయడంతో నెటిజనులు ఈ ట్వీట్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏదైనా సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నారా అంటూ కామెంట్ చేయగా మరికొందరు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంత ఎగ్జైట్మెంట్ న్యూస్ ఏంటో తెలియాలంటే ఆ విషయంపై నోయల్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందేనని చెప్పవచ్చు.

Also read:ఆ ఎమ్మెల్యే కు ఫోన్ చేసిన మెగాస్టార్ .. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -