Friday, April 19, 2024
- Advertisement -

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న కీర్తి సురేష్.. గుడ్ లక్ సఖి?

- Advertisement -

మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్నారు.ఇండస్ట్రీలోకి వచ్చిన కేవలం కొంత సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత ఏడాది ప్రధాన పాత్రలు పోషిస్తూ నటించిన “గుడ్ లక్ సఖి” సినిమా గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో వాయిదా పడగా తాజాగా రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

జూన్ 4వ తేదీ గుడ్ లక్ సఖి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఈ నేపథ్యంలోనే కరోనా రెండవ దశ రావడంతో ఇప్పుడు కూడా వాయిదా పడింది. ఈ మధ్యలోనే కీర్తి సురేష్ నటించిన “మిస్ ఇండియా”, “పెంగ్విన్” డిజిటల్ మీడియా వేదికగా విడుదలయినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ సినిమాల ప్రభావం గుడ్ లక్ సఖి పై పడిందని చెప్పవచ్చు.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

డిజిటల్ మీడియా వేదికగా ఏ మాత్రం క్రేజీ లేకుండా ఉన్న గుడ్ లక్ సఖి సినిమాకు ప్రస్తుతం క్రేజీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి ఓటీటీ సంస్థ జీ5 నుండి మంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మరి గుడ్ లక్ సఖి సినిమా గుడ్ టైం కోసం ఎదురుచూస్తుందా లేకపోతే డిజిటల్ మీడియాలో విడుదలకు సిద్ధమవుతుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also read:పర్యావరణ దినోత్సవంగా మొక్కను నాటిన స్టైలిష్ స్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -