Thursday, March 28, 2024
- Advertisement -

కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించి షాకింగ్ విషయాలు..!

- Advertisement -

కాజల్ పెళ్లిపై గతంలో రకరకల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మొత్తానికి కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ వివాహం నిశ్చయమైంది. ఇక కాజల్, గౌతల్ లు చూడముచ్చటగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కాగా, అసలీ గౌతమ్ కిచ్లూ ఎవరంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు.

ఇంటి అలంకరణ, టెక్ డిజైన్ సేవలందిస్తున్న ‘డిసర్న్ లివింగ్’ అనే కంపెనీ వ్యవస్థాపకుడు గౌతమ్. ప్రస్తుతం ఈ కంపెనీ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీకి మంచి ఆర్డర్లే ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ గౌతమ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరచి చూస్తే, హోమ్ ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలు విరివిగా కనిపిస్తాయి.

గౌతమ్ క్యాథడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ తో పాటు టఫ్ట్స్ యూనివర్శిటీలో చదువు కంప్లీట్ చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రత్యేక కోర్సులను నేర్చుకున్న తర్వాత.. సొంత కంపెనీ పెట్టారు. ఆస్తులు కూడా బానే ఉన్నాయట. మూడు రోజుల పాటు ముంబైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్ ‌లో వీరి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ ‌డౌన్‌ తరువాత ముంబైలో జరగనున్న తొలి సెలబ్రిటీ వివాహం ఇదే. పెళ్లికి కొద్దిమంది మాత్రమే హాజరైనా, వేడుకలు ఆడంబరంగానే జరుగుతాయని సమాచారం.

ఆ హీరో ముద్దు పెట్టాలను చూశాడు : ఈషా రెబ్బా

అజిత్ హీరో అయ్యింది బాలు గారి వల్లే.. ఎవరికి తెలియని విషయం..!

షోలో అందరు చూస్తుందగా ముద్దు పెట్టిన హీరో..!

అవినాష్ బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాడో బయటపెట్టిన హైపర్ ఆది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -