Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. డాన్స్ లు, అల్లర్లు, గొడవలు, ఏడుపులు, ప్రేమలు అన్ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నాయి. అభిజిత్, అఖిల్, మోనాల్ మధ్య ఏదో ఉందని అందరికి డౌట్ వచ్చేలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అలానే హారిక, అభిజిత్ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అవినాష్, అరియానా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే తాజాగా ఎలిమినేషన్ ప్రకటించే ప్రక్రియ జరిగింది. హౌస్ లో అఖిల్ కి, అభిజిత్ కు అసలు పడటం లేదు.

అఖిల్ సైలెంట్ గా ఉంటూ తన గేమ్ తాను ఆడుకుంటూ వెళ్తున్నాడు. అభిజిత్ మాత్రం హారికతో క్లోజ్ గా ఉంటూనే మోనాల్ తో క్లోజ్ గా ఉంటున్నాడు. ముందు నుంచి గమనిస్తే అఖిల్ ఒకేలా ఉన్నాడు. అభిజిత్ మారుతూ వచ్చాడు అన్న విషయం అర్దం అవుతుంది. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ ను నామినేట్ చేశాడు. అలానే హారిక కూడా అఖిల్ ను నామినేట్ చేసి అతని ఫేస్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసింది. మరో ముగ్గురు కూడా అఖిల్ ను నామినేట్ చేశారు. అందరిలోకెళ్లా అఖిల్ ఎక్కుగా నామినేట్ అయ్యాడు.

గత సీజన్స్ తీసుకుంటే సీజన్ 2లో కౌశల్ ని కూడా సేమ్ ఇలానే అఖిల్ మాదిరి అందరు టార్గెట్ చేసి బయటకు పంపించాలని అని చూశారు. కానీ కౌశల్ గేమ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యి.. అతని ప్రతి సారి సేవ్ చేస్తూ వచ్చి చివరికి విన్నర్ ని చేశారు. సీజన్ 3 చూస్తే ప్రతి సారి రాహుల్ సిప్లి గంజ్ ను నామినేట్ చేస్తూ వచ్చారు. కానీ రాహుల్ జెన్యున్ గా ఆడటం వల్ల అతనికి ఓట్లు ఎక్కువగా పడి ప్రతిసారి నామినేట్ నుండి సేవ్ అవుతూ వచ్చాడు. చివరికి రాహుల్ విన్నర్ గా నిలిచాడు.

ఇప్పుడు అఖిల్ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. అవమానాలను భరిస్తున్నాడు. ఆడవాళ్లకు సెస్పెక్ట్ ఇస్తున్నాడు. తన గేమ్ తాను ఆడుగుతూ నిజాయితిగా ఉన్నాడు. కొందరికి అఖిల్ ను చూసి ఒర్వలేక కావాలనే నామినేట్ చేస్తున్నట్లు షో చూసే ప్రేక్షకులు అంటున్నారు. సోషల్ మీడియాలో అఖిల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కౌశల్, రాహుల్ జరిగినట్లే అఖిల్ కి జరుగుతుంది కాబట్టి.. అఖిల్ ఈ సారి ఖచ్చితంగా విన్నర్ గా నిలుస్తాడని నిజాయితాగా అడుగుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

మోనాల్ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళిన అభిజిత్, అఖిల్..!

బాలు గారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -