Saturday, April 20, 2024
- Advertisement -

ఆ రోజు కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న : ధనుశ్

- Advertisement -

తమిళనాట రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మామ ఇమేజ్ ఏమాత్రం వాడకుండా ధనుష్ నటుడిగా, సంగీత దర్శకుడిగా,గాయకుడిగా మాత్రమే కాదు నిర్మాత కూడా తన సత్తా చాటుతున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ధనుష్ మొట్టమొదటి సారిగా తెలుగు లో డైరెక్ట్ గా నటించబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు ముస్తాబవుతోంది.

థియేటర్లు తెరుచుకున్న వెంటనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ధనుశ్ తో ఉండనుందంటూ ఒక ప్రకటన అధికారికంగా వచ్చేసింది. ఈ కాంబినేషన్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. తెలుగు లో శేఖర్ కమ్ములకు మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం ధనుష్ కి తెలియడంతో ఈ క్రేజీ కాంబినేషన్ కి ఒప్పుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో ధనుశ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మాణంలో కలిసి పనిచేయబోతున్నందుకు తనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నాడు. అంతేకాదు తనకు మొదటి తెలుగు సినిమా కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉందని అంటున్నారు ధనుష్.

థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది.. తాజా సర్వే వివరాలు ఇవే!

మోహన్ లాల్ ‘మరక్కర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -