Sunday, May 5, 2024
- Advertisement -

విజయ్​ బర్త్​డే పోస్టర్.. ఫ్యాన్స్​కు పూనకాలు

- Advertisement -

తమిళనాట రజనీకాంత్​ తర్వాత అంతటి మాస్​ ఇమేజ్​ సొంతం చేసుకున్నాడు ఇళయ దళపతి విజయ్​. ఆయన సినిమా విడుదలయ్యిందంటే ఫ్యాన్స్​కు పూనకాలే. ఆయన సినిమాకు మార్కెట్​ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కసారైన విజయ్​తో నటించాలని ఎందరో హీరోయిన్స్​ కలలు కంటూ ఉంటారు. ఈనెల 22 న విజయ్​ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ఫ్యాన్స్​ భావిస్తున్నా.. అందుకు కరోనా నిబంధనలు అడ్డొస్తున్నాయి.

విజయ్​ పుట్టినరోజు సందర్భంగా సెవెన్ స్క్రీన్ స్టూడియో ఓ పోస్టర్​ విడుదల చేసింది. ఈ పోస్టర్​ చూసిన ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. విజయ్​ గత చిత్రం మాస్టర్​ను సెవెన్​ స్క్రీన్​ స్టూడియో నిర్మించిన విషయం తెలిసిందే. విజయ్​ ఇప్పటివరకు మొత్తం 64 సినిమాల్లో నటించాడు. దీంతో ఈ 64 పాత్రలకు సంబంధించిన గెటప్స్​తో సెవెన్ స్క్రీన్ స్టూడియో ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్​ వైరల్​గా మారింది. ముఖ్యంగా విజయ్​ ఫ్యాన్స్​ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

ప్ర‌స్తుతం విజ‌య్ 65వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ నెల‌ 21న సాయంత్రం 6 గంటలకు ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదల కానున్నది.అభిమాన సంఘాలు, వ్యక్తిపూజలు తమిళనాడులో మనకంటే కాస్త ఎక్కువే ఉంటాయి. తమ అభిమాన నటుడి నిలువెత్తు కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం అక్కడ చాలా కామన్​. ఇక విజయ్​ ఫ్యాన్స్​ ఈ పుట్టినరోజున ఏ విధంగా జరుపుకుంటారో వేచి చూడాలి.

Also Read:బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -