Sunday, April 28, 2024
- Advertisement -

గొప్ప డైరెక్టర్ ఇక లేరన్న వార్త బాధాకరం.. అల్లు అర్జున్!

- Advertisement -

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్‌(54) కన్నుమూశారు. శుక్రవారం ఆయన చెన్నై ఆస్పత్రిలో తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రముఖ దర్శకుడు మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆనంద్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ ఇక లేరన్న వార్తతో నిద్ర లేచాను. అద్భుతమైన కెమెరామన్‌, ఒక గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం ఆయనను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. అంటూ ఆయన మృతి పట్ల అతని కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

సుమారు పది సంవత్సరాల పాటు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆనంద్ మొట్టమొదటిసారిగా 2005లో ‘కన కందేన్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్‌, కో, మాట్రాన్‌, అనేగన్‌, కవన్‌, కప్పాన్‌ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన రంగం, శివాజీ సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి.1994లో తొలిసారిగా మలయాళ మూవీ ‘తెన్మావిన్‌ కోంబత్‌’కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. తొలి సినిమాకే ఆనంద్ జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

Also read:ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్.. డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు అలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -