Friday, May 3, 2024
- Advertisement -

బాలయ్య తో పెట్టుకుంటున్న దిల్ రాజు .. పెద్ద వార్ :

- Advertisement -

బాలకృష్ణ తన 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సినిమా మీద మొదటి నుంచీ మంచి గురి ఉన్న బాలయ్య సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపడానికి సర్వదా ప్రయత్నాలు చేస్తున్నారు. పెర్ఫెక్ట్ ప్లానింగ్ లో బాలయ్య తనదైన శైలి లో రాణిస్తున్న ఈ సినిమా కి సంక్రాంతి 2017 న ఫిక్స్ అని షూటింగ్ అప్పుడే నిర్మాతలు ప్రకటించేసారు.

అయితే సంక్రాంతి రోజునే మరిన్ని సినిమాలో రాబోతున్న తరుణం లో దిల్ రాజు డైరెక్ట్ గా బాలయ్య ని ఎదురుకొంటున్నాడు . తన కొత్త సినిమా శతమానం భవతి తో దిల్ రాజు ఈ ఫీట్ చేయ్యబోతున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కి కూడా శర్వానంద్ బాలయ్య ని ఎక్స్ ప్రెస్ రాజా తో ఎదురు వెళ్ళాడు.

మళ్ళీ వచ్చే సంవత్సరం రాబోతున్న శతమానం భవతి లో కూడా శర్వానంద్ హీరో అవ్వడం గమనార్హం. బొమ్మరిల్లు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోషన్ పోస్టర్ తో షాక్ ఇచ్చిన దిల్ రాజు వచ్చే సంక్రాంతి బరిలో సినిమా దించాలని చూస్తున్నాడు. మరి ఇప్పటికే బాలయ్య బాబు పొంగల్ రిలీజ్ ఫిక్స్ చేశాడు. బాలయ్యకే ఎదురెళ్లాలని దిల్ రాజు ధైర్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

Related

  1. అయ్యో బాలయ్యా.. బాబు అలా చేశారా?
  2. గ్రీకు సైనికులతో బాలయ్య యుద్ధం
  3. బాలయ్య బాబు అభిమానులకు పండుగ
  4. బాలయ్య కోసం భారీ సెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -