Thursday, May 9, 2024
- Advertisement -

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఫ్లాప్ మూవీతోనైనా అధిరిపోయే కలెక్షన్లు రాబట్టడం మహేశ్ కే సొంతం. ఇక మహేశ్ తో మూవీ చేసేందుకు ఏ డైరెక్టర్ కైనా ఒక డ్రీమ్ గా ఉంటుంది. అలా ఒక్కసారి మహేశ్ తో మూవీ చేస్తే ఆ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోతాడు. అందుకే మహేశ్ తో మూవీ చేసేందుకు ప్రతి డైరెక్టర్ అమితంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే కోవలో ఓ లేడి డైరెక్టర్ కూడా మహేశ్ బాబుతో మూవీ చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుధ కొంగర.

ఈమె దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ” ఆకాశమే నీ హద్దురా ” మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డ్ కూడా ఈ మూవీకి లభించింది. దాంతో సుధ కొంగర తరువాతి సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఆ మద్య ఈ లేడి డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ తో మూవీ చేయబోతుందని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ స్టోరీని సుధ కొంగర మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్లిందట, అయితే ఆ బయోపిక్ లో నటించేందుకు మహేశ్ ఆసక్తి చూపలేదట. దాంతో సుధ కొంగర ఆ స్టోరీని ఇప్పుడు ఇతర హీరోలతో తీసేందుకు ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ఈ బయోపిక్ ను ఇప్పుడు సూర్యతో తెరకెక్కించేందుకు సుధ కొంగర ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆకాశం నీ హద్దురా మూవీతో కెప్టెన్ గోపినాథ్ బయోపిక్ ను తెరపై ఆవిష్కరించి అధిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ లేడి డైరెక్టర్.. ఇప్పుడు రతన్ టాటా బయోపిక్ పై దృష్టి .పెట్టడంతో.. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తోందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

పుష్ప2 లో లేడి విలన్ ?

మహేశ్ స్టోరీ అదే.. జక్కన క్లారిటీ !

చిరుకు సమ్మర్ లో కూడా తప్పని పోటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -