Friday, May 3, 2024
- Advertisement -

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ గత కొన్నాళ్లుగా వరుస పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తరువాత ఇండియా వైడ్ గా ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరగడంతో పాన్ ఇండియా ఆడియన్స్ ను అలరించేందుకు కు వరుసగా అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే చ్స్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మూవీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ప్రభాస్ ఆశించిన స్థాయిలో విజయాలను నమోదు చేయలేకపోయాడు. సాహో హిందీలో పవరలేదనిపించినప్పటికి, రాధేశ్యామ్ మాత్రం ఘోరంగా నిరాశ పరిచింది. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ” ఆదిపురూష్, సలార్, ప్రాజెక్ట్ కే.. ” మూవీస్ తో పాటు స్పిరిట్.. మూవీ కూడా లైన్ లో ఉంది. .

అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మారుతి మూవీకి కమిట్ అయ్యాడు ప్రభాస్. మారుతి డైరెక్షన్ లో పక్కా ఎంటర్ టైనర్ మూవీ చేయనున్నాడు డార్లింగ్. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదట. ఈ మూవీని కేవలం తెలుగులో తెరకెక్కించి ఇతర భాషల్లోకి డబ్ చేసే అవకాశం ఉందట. ఇక ఈ మూవీకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా బాగా వైరల్ అవుతోంది.

ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందని సమాచారం. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు హర్రర్ జోనర్ ట్రై చేయలేదు. దాంతో మొదటి సారి మారుతి చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో మారుతి ” ప్రేమ కథ చిత్రమ్ ” వంటి హర్రర్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తో చేస్తున్న మూవీ అంతకు మించి ఎంటర్ టైన్ చేస్తుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ మూవీలో కథకు తగ్గట్లుగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఖరారు కాగా, మూడో హీరోయిన్ గా రాధేశ్యామ్ లో నటించిన రిద్ది కుమార్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మరి మొట్ట మొదటిసరిగా హర్రర్ జోనర్ లో నటిస్తున్న ప్రభాస్ ఈ మూవీతో ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -