Thursday, March 28, 2024
- Advertisement -

నా శ్రీదేవి అంటూ హరీష్ శంకర్ షాకింగ్ ట్విట్..?

- Advertisement -

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికైనా నచ్చిన ఒక సినిమా లేదా ఒక పాట చూడాలంటే ప్రేక్షకులు ఎక్కువ సార్లు ఆ పాటలను చూడటం వల్ల పాటలు రికార్డుల సునామిలను సృష్టిస్తున్నాయి. దీంతో కొన్ని పాటలు 100 మిలియన్ వ్యూస్ లను చేరుకుంటూ అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో అనే పాటను రీమిక్స్ చేశారు. అచ్చం శ్రీదేవి శోభన్ బాబు మాదిరిగానే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పూజా హెగ్డేలను దర్శకుడు హరీష్ శంకర్ చూపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఈ పాటకు ఆదరణ పెరిగింది.

Also read:కియారా అద్వానీ కిక్.. వైరల్ వీడియో!

తాజాగా ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంతో పూజా హెగ్డే హరీశ్ శంకర్ గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.పూర్తి ప్రేమతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది చాలా మంది వరకు చేరుతుందని నాకు నేర్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్. ఈ పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేయాలనే మీ కల అద్భుతమైన విజయాన్ని సాధించింది థాంక్యూ సార్ అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా పూజ హెగ్డే చేసిన ట్వీట్ కి స్పందించిన హరీష్ శంకర్ నా శ్రీదేవి అంటూ మరింత రియాక్ట్ కావడం ఎంతో విశేషం.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -