హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

- Advertisement -

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కామెడీ హైపర్ ఆది తన కామెడీ పంచ్ లతో అందరిని ఎంతగానో నవ్విస్తారు.హైపర్ ఆది స్కిట్ చేశాడంటే అందులో డబుల్ మీనింగ్ డైలాగులు, ఇమిటేషన్, బూతు డైలాగులు, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ లేకుండా హైపర్ ఆది స్కిట్ ఉంటుందంటే అది నమ్మశక్యం అని చెప్పవచ్చు. అయితే హైపర్ ఆది ఈ విధంగా చేసిన స్కిట్ కారణంగా అతని పై పోలీస్ కేసు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా హైపర్ ఆది పై పోలీస్ కేసు నమోదు కావడం గురించి మూవీ క్రిటిక్ కత్తి మహేష్ హైపర్ ఆది గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైపర్ ఆది తప్పు ఏమాత్రం లేదని తెలిపారు. అతను చేసే స్కిట్ లకు మనం నవ్వే నవ్వులు, ఇచ్చే లైకులు, వచ్చే రేటింగులు అతనిని ప్రోత్సహించడానికి కారణమయ్యాయి. ఈ విషయంలో సగం తప్పు హైపర్ ఆది అయితే మిగిలిన తప్పు మనది అని చెప్పారు.ఇంతకీ హైపర్ ఆది పై పోలీస్ కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటంటే…

- Advertisement -

Also read:అంతా చూస్తుండగానే సుధీర్ ను చూస్తూ అలా చేసిన రష్మీ!

జూన్ 12వ తేదీ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ యాసను కించపరుస్తూ స్కిట్ చేయడంతో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.ఇదివరకే హైపర్ ఆది విషయంలో ఈ విధమైనటువంటి ఫిర్యాదులు ఎన్నో వచ్చినప్పటికీ ఆది లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈసారైనా తన పద్ధతి మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -