Tuesday, April 16, 2024
- Advertisement -

దృశ్యం- 2లో కమల్ సరసన మీనా?

- Advertisement -

జీతూ జోసెఫ్​ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం మూవీ అన్ని భాషల్లోనూ విడుదలై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మిడిల్​ క్లాస్​ మెలోడ్రామాగా ఈ సినిమా సూపర్​ హిట్​ అయ్యింది. తెలుగు రీమేక్ దృశ్యంలో మీనా ​- వెంకటేశ్​ జంటగా నటించగా.. తమిళ రీమేక్ పాపనాశనంలో కమల్ హాసన్​ – గౌతమీ జోడీగా చేశారు. ఇటీవల మలయాళంలో దృశ్యం సీక్వెల్​ గా కూడా ఇటీవల విడుదలై సూపర్​ హిట్ అయ్యింది. దీంతో అన్ని భాషల్లో దృశ్యం2 సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే తెలుగులో దృశ్యం 2 షూటింగ్​ పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉంటే తమిళంలో ఇండియన్​ -2లో నటిస్తున్న కమల్​ హాసన్​.. వివిధ కారణాల వల్ల ఆ సినిమాను పక్కనపెట్టాడు. ప్రస్తుతం దృశ్యం 2లో నటించాలని ఆయన భావిస్తున్నారు. జీతూ జోసెస్​ ను డైరెక్టర్​గా పెట్టుకోవాలని భావించారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరు? అన్న విషయంలో సందిగ్ధత నెలకొన్నది. ఎందుకంటే దృశ్యం- 1 తమిళంలో గౌతమి చేసింది. అప్పుడు కమల్​ – గౌతమి రిలేషనల్​లో ఉన్నారు. దీంతో ఈ మూవీ చేశారు. ప్రస్తుతం వివిధ కారణాలతో వాళ్లు విడిపోయారు. కాబట్టి గౌతమితో చేసే చాన్స్​ లేదు. దీంతో గౌతమి ప్లేస్​లో మీనాను ఎంపికచేసినట్టు సమాచారం. మీనా – కమల్​ కాంబినేషన్​లో గతంలో పలు సినిమాలు వచ్చాయి. పాతికేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలసి నటించబోతున్నారు.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

రాయలసీమ బ్యాక్​డ్రాప్ లో రవితేజ మూవీ..!

190 దేశాలు, 17 భాషల్లో ధనుష్ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -