Friday, March 29, 2024
- Advertisement -

‘పెళ్లి సందడి 2’ లో దర్శకేంద్రుడు!

- Advertisement -

తెలుగు తెరపై ఎన్నో అద్బుతమైన చిత్రాలను ఆవిష్కరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. త్వరలో వెండితెరపై కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన తెలుగు ప్రేక్షకులు ఎన్నటికి మరిచిపోలేని ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించారు. ఆయన సినిమాలో నటిస్తే చాలు స్టార్ స్టేటస్ వస్తుందని హీరోలు.. హీరోయిన్లు ఉవ్విళ్లూరిన చరిత్ర ఆయనది. బాక్సాఫీసు వద్ద కాసుల మోత మోగించిన నిర్దేశకుడు. అలా దశాబ్దాలుగా కెమెరా వెనకుండి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు ఇప్పుడు.. ఈ వయసులో.. కెమెరా ముందుకు వస్తున్నారు.

తనికెళ్ల భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దాంతో రాఘవేంద్రరావు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే దానికంటే ముందుగానే రాఘవేంద్రరావు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ‘పెళ్లి సందడి’ సినిమాతో కావడం విశేషం. రాఘవేంద్రరావు తీసిన హిట్టు చిత్రాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి.

పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ కి స్టార్ హోదా వచ్చింది. ఈ సినిమా సీక్వెల్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.సినిమా ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాగబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రాఘవేంద్రరావు లీడ్ రోల్ లో కనిపించబోతున్నారట.

స్టూడెంట్స్ ఎమోషన్… వైఎస్ షర్మిళా రియాక్షన్…

ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -