దేశంలో కరోనా సేకండ్ వేవ్ ఇప్పుడు సెలబ్రెటీలకు ముప్పుగా మారింది. ఇటీవల ప్రచారాలు, ఈవెంట్స్ కి హాజరైన సినీ, రాజకీయ నేతలు వరుసగా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా మాస్ మహరాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కరోనా బారిన పడినట్టు ప్రకటించారు. రమేష్ వర్మ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా ఖిలాడీ
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
జయంతిలాల్ గడతో కలిసి కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా రమేష్ వర్మ తనకు కోవిడ్ సోకినట్టు నిర్ధారించారు. హలో ఎవ్రీవన్..నేను కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాను.
నాకు పాజిటివ్ అని తేలిసింది. భద్రతా చర్యల్లో భాగంగా నేను ప్రస్తుతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి. అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి. సురక్షితంగా వుండండి
అని ట్వీట్ చేశారు.
సాగర్ సభతో కరోనా కలకలం..నోముల భగత్‌కు కరోనా!
దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 2.59 లక్షల మందికి వైరస్
ఏపి అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’