Friday, March 29, 2024
- Advertisement -

దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. కొత్త‌గా 2.59 లక్ష‌ల మందికి వైరస్

- Advertisement -

భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఇందుకు ప్రజల నిర్లక్ష్యం కారణం అని.. సెకండ్ వేవ్ ఉధృతి బీభత్సంగా ఉందని, మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ మాత్రమే తప్పకుండా ఉంచుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ కొంత మంది గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. కరోనా భద్రతలు ఏమాత్రం పాటించడం లేదు.

ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం ప్రజలను తీవ్ర భయందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న‌ కొత్త‌గా 2,59,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,761 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,80,530కు పెరిగింది. ప్రస్తుతం 20,31,977 యాక్టివ్‌ కేసులున్నాయి. సోమవారం వరకు మొత్తం 12,71,29,113 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఏపి అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’

‘సలార్’ లో శృతి హాసన్ ఆ పాత్రలో కనిపించబోతుందట..

షభాష్ బైడన్ అంటున్న ట్రంప్.. కారణం అదేనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -