Saturday, April 20, 2024
- Advertisement -

సాగర్ సభతో కరోనా కలకలం..నోముల భగత్‌కు కరోనా!

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎన్నికలు రావడం.. సభలు, ప్రచారాలు నిర్వహించిన వారికి కరోనా రావడం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం, సభల ఎఫెక్ట్ ఘోరంగా పడింది. పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది.

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ వైరస్ బారిన పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా భారిన పడ్డట్టు సమాచారం. అంతే కాదు పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం కరోనా బారిన పడ్డారు. అంతే కాదు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిన్న ఒక్క రోజే 160 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సమయంలో ప్రచారాలు చేయొవద్దని.. ప్రజలు గుంపులుగా వస్తారని చెప్పినా నాయకులు అవేవీ పట్టంచుకోకపోవడం వల్లనే కేసులు పెరిగిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు.

దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. కొత్త‌గా 2.59 లక్ష‌ల మందికి వైరస్

ఏపి అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’

‘సలార్’ లో శృతి హాసన్ ఆ పాత్రలో కనిపించబోతుందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -