Saturday, April 20, 2024
- Advertisement -

ఈయన ఎవరో గుర్తు పట్టారా..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో నటుడు,దర్శకుడు, నిర్మాత,సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు ఒక్కటేమిటి అన్ని రంగాల్లో తనదైన మార్క్ చాటుకున్న మల్టీస్టారర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఎక్కువ కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రాలు ఎప్పుడు చూసినా కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈయన తెలుగులో కృష్ణ,బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించారు.

మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్న ఎన్టీఆర్!

ఆలీ లాంటి చిన్న కమెడియన్ హీరోగా చూపించిన ఘనత ఆయనకే దక్కింది. ఎస్వీ కృష్ణారెడ్డి ..దర్శకుడిగానే కాకుండా నటుడిగా ‘ఉగాది’, అభిషేకం వంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో డైరెక్టర్ కమలకర కామేశ్వరరావు పాత్రలో కాసేపు క్యామియో పాత్రలో కనిపించారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డికి చిరంజీవితో ఓ మూవీ తీయాలనే కోరిక ఉండేదని పలు మార్లు చెప్పారు.. కానీ అది నెరవేరలేదు.

వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. అధికారులకు కీలక సూచన!

కాకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎస్వీ కృష్ణారెడ్డి. 34 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిరాతకుడు’ సినిమాలో విలన్‌ కన్నడ ప్రభాకర్‌కు అసిస్టెంట్ పాత్రలో నటించారు కృష్ణారెడ్డి. ఈ పాత్రలో ఈయన యాక్టింగ్ కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఆ పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డిని చూస్తే గుర్తు పట్టడం నిజంగా చాలా కష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -