Wednesday, May 8, 2024
- Advertisement -

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం…

- Advertisement -

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఇటీవల పలు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కొవిడ్ తీవ్రత నడుమ సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటి ంగ్ ఆదివారం జరుగుతుంది. రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఏ పార్టీ లేదా ఏ కూటమి బలాబలాలకు పరీక్షగా నిలిచాయి.

ఈయన ఎవరో గుర్తు పట్టారా..

ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కొన్ని చోట్ల పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌లో తన గెలుపు కోసం బిజెపి హోరాహోరి పోరు సాగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. మధ్యాహ్నానికి ఫలితాలపై ఓ అంచనా రానుండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

క‌ర్నూలులో విషాదం… ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి

తిరుపతి ఉప ఎన్నిక సరళి మరో రెండుమూడు గంటల్లో తెలిసిపోనుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎం. గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -