Saturday, April 27, 2024
- Advertisement -

వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. అధికారులకు కీలక సూచన!

- Advertisement -

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ నుంచి వైద్య, ఆరోగ్యశాఖను బదిలీ చేశారు. ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ స్వయంగా చేపడుతున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కూడా తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటనే బాధ్యతలు అందుకుని, కరోనా పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read Also : కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సీఎం కేజ్రీవాల్ సతీమణి

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ విషయంలో గానీ, ఆక్సిజ‌న్ మరియు బెడ్ల‌ లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయొద్ద‌ని సీఎంకు స్ప‌ష్టం చేశారు.

Read Also : 2022 లో ఒక్కరు కూడా మిగలరు… ఆర్జీవి షాకింగ్ కామెంట్స్

ఆక్సిజన్, బెడ్లు, రెమ్ డెసివిర్, ఇతర ఔషధాల లభ్యత విషయంలో ఏ మాత్రం లోపం రాకూడదని అన్నారు. కరోనా పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థంగా పనిచేయాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -