Thursday, April 25, 2024
- Advertisement -

మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్న ఎన్టీఆర్!

- Advertisement -

టాలివుడ్ లో కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిలో సెన్సేషనల్ డైరక్టర్ కొరటాల శివ, మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘జనతా గ్యారేజ్’ ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తూ ఏ రేంజ్‌లో సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ కాంబోలో సినిమా వస్తుందనగానే ఎన్టీఆర్ అభిమానుల్లోభారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఎన్టీఆర్ తన 30వ చిత్రం సెన్సేషనల్ మాస్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.ఈ మూవీ స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతుందని,కొందరి స్వార్థం రాజకీయాల కారణంగా వారి భవిష్యత్తు దెబ్బతినవద్దు అనే ఉద్దేశంతో బరిలోకి దిగిన వ్యక్తిగా ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడట.అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పటికే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నమల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ అతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే.

Also read:బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -