Saturday, April 27, 2024
- Advertisement -

SSMB28 పై ఇన్ని డౌట్లా.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ” SSMB28 ” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆ తరువాత షూటింగ్ కు కొంత విరామం తీసుకుంది చిత్రా యూనిట్. అయితే అంతలోనే మహేశ్ తల్లి మరణించడంతో షూటింగ్ ను మరింత పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ మద్య నే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్ను మూయడంతో ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా కనిపించడంలేదు. అయితే ఈ మూవీని ఏప్రెల్ 28న విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్ ప్రకటించినప్పటికి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా పడుతుండడంతో అనుకున్న తేదీకి మూవీ రావడం కష్టమే అని తెలుస్తోంది..

ఇదిలా ఉంచితే మూవీ స్టోరీ పరంగా కూడా చాలానే మార్పులు చేస్తున్నారట. మొదట అనుకున్న కథ రొటీన్ ఫార్మాట్ లో ఉండడంతో మహేశ్ కొంత అసంతృపిగాగ్ ఉన్నాడని, అందుకే త్రివిక్రమ్ మహేశ్ మద్య తరచుగా స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయనే వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం మారిన స్క్రిప్ట్ కారణంగా మొదటి షెడ్యూల్ లో కంప్లీట్ చేసిన ఫైట్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారని వినికిడి. దాంతో మారిన స్క్రిప్ట్ తో ఇకపై కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతుందట చిత్ర యూనిట్. మరి ఇలా రకరకాలుగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంతమేర ఉందో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం ” SSMB28 ” పై కాస్త అసహనంగానే ఉన్నారు. మరి ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న ఈ మూవీ.. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిరుకు సమ్మర్ లో కూడా తప్పని పోటీ..!

అల్లు అర్జున్ కోసం రాసిన కథలో ఎనర్జీటిక్ హీరో ?

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -