Monday, April 29, 2024
- Advertisement -

అరటిపండును ఇలా తింటున్నారా..జాగ్రత్త!

- Advertisement -

మన రోజు వారి దినచర్యలో బోజనం చేసిన తరువాత అరటి పండు తినడం చాలమందికి ఉండే అలవాటు. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు అరటిపండు చాలా మేలు చేస్తుందని, పెద్దలు మరియు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. దాంతో అరటి పండు తినడానికి చాలమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అరటిపండులో ఉండే ఎన్నో రకాల పోషకాలు శరీనానికి కావల్సిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ను అందిస్తాయి. అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. .

అలాగే శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా అరటి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా అరటిపండు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అరటిపండును చాలమంది బోజనం చేసిన వెంటనే తింటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలమంది మద్యాహ్నంతో పాటు రాత్రిపూట కూడా అరటిపండు తింటూ ఉంటారు. అయితే రాత్రిపూట రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉందట.

అలాగే జలుబు అజీర్తి, వికారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దాదాపుగా రాత్రిపూట అరటిపండు తినడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మద్యాహ్నం కూడా బోజనం చేసిన వెంటనే అరటి పండు తినకుండా కనీసం ఒక గంట గ్యాప్ తీసుకొని అరటిపండు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఉదయాన్నే పడిగడుపున కూడా అరటిపండు తింటే వికారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయని.. అందుకే పడిగడుపున కూడా అరటిపండు తినకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

క్యారెట్ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

రాత్రిపూట వెల్లుల్లి తింటే.. ఎమౌతుందో తెలిసా ?

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -