Saturday, May 4, 2024
- Advertisement -

వైఎస్ ష‌ర్మిల చేతుల మీదుగా ఏమిటో ఏమిటో!?

- Advertisement -

కొత్త కుర్రాడు ప‌వ‌న్ తేజ్ కొణిదెల‌ టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఈ క‌థ‌లో పాత్ర‌లు క‌ల్పితం. అభిరామ్ ఎం ద‌ర్శ‌కుడు. ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మేఘన, ల‌క్కి క‌థానాయిక‌లు‌. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువైన ప‌వ‌న్ తేజ్ న‌టిస్తున్న ఈ సినిమాలోని రెండో పాట తాజాగా విడుద‌లైంది.

కార్తీక్ కొడకొండ్ల సంగీతం సమకూర్చిన ఏమిటో ఏమిటో లిరిక‌ల్‌ను కాసేప‌టి క్రిత‌మే రిలీజ్ చేశారు. శ్రేష్ట ర‌చించిన ఈ పాట‌ను సింగ‌ర్ దీపు జాను, నూత‌న మోహ‌న్ మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఆల‌పించారు. ఏమిటో ఏమిటో ఇంత‌గా ఏమిటో మ‌న‌సుకింత అల‌జ‌డేమిటో … తూలుతూ తేలుతూ న‌వ్వులెన్నొ రువ్వుతూ..రేగుతున్న ఊహ‌లేమిటో అంటూ సాగిన ఈ పాట ప్రేమికుల మ‌న‌సు దోచుకుంటోంది.

కాగా ఈ వీడియోను దివంగ‌త సీఎం వైఎస్సార్ కుమార్తె వైఎస్ ష‌ర్మిల విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ టీం ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి స‌మీప బంధువైన ప‌వ‌న్ తేజ్ పాట‌ను ఆమె రిలీజ్ చేయ‌నుండ‌టంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్ప‌టికే కొత్త పార్టీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారి, రాజ‌కీయ అంశాల‌తో బిజీగా మారిన ఆమె, కాస్త వినోదంవైపు మ‌ళ్ళ‌డం విశేషం.

ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా? అయితే మీకు ఈ డైట్ పాలో అవ్వండి !

సరిగా నిద్రపోవడం లేదా..? అయితే మీకు.. !

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -