Thursday, April 25, 2024
- Advertisement -

నిమ్మగడ్డ పాచిక పారలేదు.. వాళ్లే స‌ర్పంచుల‌ని చెప్పాలా బాబు!

- Advertisement -

ప్రజలు ఓట్లేయకపోయినా మీ పార్టీ వాళ్ల‌ను సర్పంచులుగా ప్రకటించాలా బాబూ అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్య‌స‌భ ఎంపీ, పార్లమెంట‌రీ నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడును ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్ర‌లు చేసినా, తొలివిడత ఎన్నికల్లోనే ప్ర‌జ‌లు బాబుకు బుద్ధి చెప్పార‌ని సెటైర్లు వేశారు. కాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై విజ‌య‌సాయిరెడ్డి శుక్ర‌వారం ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.

నిమ్మగడ్డ పాచిక పారలేదు – కుట్రలన్నీ పటాపంచలయ్యాయి అని పేర్కొన్నారు. అదే విధంగా.. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లోనే చంద్రబాబును అద్దంలో చూపించేశారు ప్రజలు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారాలు ఉపయోగించలేదంటూ లేఖలు రాస్తున్నాడు నాయుడు బాబు అని వ్యంగ్య‌స్త్రాలు సంధించారు. పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునేవాటికి బీటలు వారాయి.

రెండో విడతలో ఇక అవి తునాతునకలే. సొంత నియోజకవర్గాల్లో తమవారిని గెలిపించుకోలేక టీడీపీ నేతలు డమ్మీలుగా మారారు.పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లోకి రేషన్ వెళ్లకుండా అడ్డంపడుతున్నాడు. పేదలకు నిత్యావసరాలు అందించడం “రాజ్యాంగ” బాధ్యత కాదా నిమ్మగడ్డా? ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తావా? అని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

ష‌ర్మిల నిర్ణ‌యం… బాబు నోటి నుంచి ఆ మాట‌..!

ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -