Thursday, April 25, 2024
- Advertisement -

బాబుకు మైండ్‌బ్లాంక్ అయ్యింది.. లోకేష్ స‌ర్పంచ్‌గా పోటీ చేయ్

- Advertisement -

దిక్కుమాలిన టీడీపీకి కుట్రలు చేయడం అలవాటేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. పంచాయ‌తి ఎన్నికల పేరిట ప‌ల్లెల్లో 7,200 వాహనాలు నిలిచేలా చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ ఎన్ని కుట్ర‌లు చేసినా తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 83 శాతం సీట్లు గెలిచామ‌ని, దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాంక్ అయ్యింద‌ని విమ‌ర్శించారు. చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ ఉంటుంద‌ని కొడాలి నాని స‌ల‌హా ఇచ్చారు.

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, ఇంటింటికీ రేషన్‌పై కొన్ని పత్రికలు ఉద్దేశ‌పూర్వ‌కంగానే చెత్త రాతలు రాస్తున్నాయని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల కోసం ఇలాంటి సౌక‌ర్యం క‌ల్పించిన ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని పేర్కొన్నారు. ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలి విడ‌త ఫ‌లితాల గురించి మాట్లాడుతూ.. అత్య‌ధిక గ్రామాల్లో త‌మ మ‌ద్ద‌తుదారులే గెలిచార‌న్నారు. బాబు మాటలు నమ్మి పోటీ చేసిన వారు ఇప్పుడు ఏడుస్తున్నారని విమ‌ర్శించారు. గ్రామాల్లో గొడవలు సృష్టించాలనేదే చంద్రబాబు కుట్ర అని, ప్ర‌జ‌లు త‌మ తీర్పుతో గ‌ట్టి స‌మాధాన‌మిచ్చార‌న్నారు.

ఎస్ఈసీకి బాబు లేఖ రాయ‌డం గురించి మాట్లాడుతూ.. రెండో దశ ఎన్నికలు వచ్చే సరికి ఐక్యరాజ్యసమితికి కూడా లేఖ రాస్తాడ‌ని ఎద్దేవా చేశారు. టీడీపీలో కిస్‌మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో టీడీపీకి క్యాడర్‌ ఉండదని కొడాలి నాని సెటైర్లు వేశారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలవ‌ని లోకేష్‌కు అస‌లు మాట్లాడే అర్హత లేదని, చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌ స్థానానికి ప‌ప్పు పోటీ చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

వైఎస్ ష‌ర్మిల చేతుల మీదుగా ఏమిటో ఏమిటో!?

నిమ్మగడ్డ పాచిక పారలేదు.. వాళ్లే స‌ర్పంచుల‌ని చెప్పాలా బాబు!

మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -