Sunday, April 28, 2024
- Advertisement -

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

- Advertisement -

ఈ మద్య కాలంలో మనం ఎక్కువగా పాలీష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా వాడుతున్నాం. దాని వల్ల ఆకలి తీరుతుంది కానీ అనారోగ్యాలు కూడా ఎక్కువగానే సంబవిస్తున్నాయి. మన పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వలన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యాలకు గురియగుతున్నారు. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం.

పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది.  ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ బియ్యంలో ఉండే పాస్పరస్ శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది.  హెల్తీ డైట్ ను పాటించడానికి కూడా తీరిక లేని బిజీ షెడ్యూల్స్ లో ఉన్నవారు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా వివిధ జీర్ణసమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

గాస్త్రైటిస్, బ్లోటింగ్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. బ్రౌన్ రైస్ లో పీచు సమృద్ధిగా ఉన్నందున, మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది.

బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున, ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది.

Also Read

త్వరలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..!

సీఎం జగన్ లేఖ.. క్షమాపణలు చెప్పిన వలంటీర్లు

ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -