Sunday, May 5, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే తల్లైంద‌ట‌..!

- Advertisement -

ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే తల్లిగా మారడం ప‌రిపాటిగా మారింది. ఇంకా చెప్ప‌లంటే త‌ల్లి కావ‌డానికి పెళ్లితో ప‌నేంటి అని అడుగుతున్నారు నేటి త‌రం. తాజాగా బాలీవుడ్‌లో ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. అయితే ఇక‌క‌డ త‌ప్పుగా అర్థం చేసుకోవాడినికి ఏం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే …బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచియం చేయ‌ల్సిన ప‌ని లేదు. 40 ఏళ్లు దాటిన ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోవ‌లేదు. తాజాగా ఈమె తల్లిగా మారింది. పెళ్లి కాకుండానే తల్లి ఎలా అయింద‌నే క‌దా మీ ప్ర‌శ్న‌.

ఏక్తా కపూర్ సరోగసి పద్ధతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 27న ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు తెలుస్తోంది. గతంలో ఏక్తాకపూర్ సోదరుడు తుషార్ కపూర్ కూడా ఇలానే సరోగసి పద్ధతి ద్వారా ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు. ఏక్తా కపూర్ గ‌తంలో చాలామందితో డేటింగ్ చేసింద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి అవి పెళ్లి వ‌ర‌కు చేర‌లేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి కాకుండానే ఓ బిడ్డ‌కు తల్లిగా మారింది ఈ స్టార్ నిర్మాత‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -