స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పాన్ఇండియా మూవీగా తీసుకొస్తున్నారు. అంతేకాక రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్.
మొత్తానికి ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.

తాజాగా ఫాహద్ ఫాజిల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పుష్ప సినిమాను అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Also Read: ఎయిర్ పోర్టులో రష్మిక మందన అందాల విందు…!