Friday, April 26, 2024
- Advertisement -

ఆ బిగ్ బాస్ ‘కంటెస్టెంట్’పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. కారణం?

- Advertisement -

స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందికి ఎంతో పేరును సంపాదించిపెట్టింది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారు ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ లోకి రాక ముందు పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసిన ఈమెను పెద్దగా ఎవరూ గుర్తించలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత ఈమె సెలబ్రిటీగా మారిపోయింది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ నిర్వహిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ “ప్రోటీన్ మార్ట్ “బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. ఈ క్రమంలోనే ఆమె రోజు తీసుకొనే ఆహారంలో ఎక్కువగా సీ ఫుడ్ వుండే విధంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రోటీన్ మార్ట్ బ్రాండ్ కి సంబంధించి ఓ యాడ్ లో నటించిన దివి తాజాగా ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ యాడ్ లో ఆమె తన వంట మనిషితో కాస్త ఓవరాక్షన్ చేయగా..అది ప్రోటీన్స్ నుండి తీసుకొచ్చినది పాపగారు అనడంతో.. తనకు ప్రోటీన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉందంటూ కాస్త ప్రోటీన్ నాన్ వెజ్ మార్ట్ గురించి అడ్వర్టైజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దివి పాప కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ ఆమెపై ఫైర్ అవుతూ.. ట్రోలింగ్ చేస్తున్నారు.

అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ..

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -