Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీలో సింపతీ రాజకీయాలు..ప్రజా మద్దతు ఎవరికి?

- Advertisement -

ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఇక వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఈసారి వైసీపీ, టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా పోటీలో నిలుస్తోంది. దాంతో ఈసారి ఏపీ ప్రజానీకం ఏ పార్టీకి పట్టం కడతారనేది ఆసక్తికంగా మారింది. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తమ ప్రభుత్వానికే పట్టం కడతారని జగన్ ధీమా వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మార్పు కోరుకుంటున్నారని టీడీపీ, జనసేన పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు మూడు ప్రధాన పార్టీలు కూడా సింపతీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో ” ఒక్క ఛాన్స్.. ” అంటూ ప్రజా సింపతీ పొందడంలో జగన్ సక్సస్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అధికారంలోకి రావడానికి కారణం కూడా అదే. దాంతో గత ఎన్నికల్లో జగన్ అనుసరించిన సింపతీ వ్యూహాన్ని ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి. వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం అయిన నేపథ్యంలో గెలిచి తీరాల్సిన ఎన్నికలు కావడంతో చంద్రబాబు ప్రజాసానుభూతి కొరకు ” ఇదే నా చివరి ఎన్నిక.. ” అంటూ సింపతీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జరిగిన అవమానాలను ప్రజల్లో బలంగా ప్రస్తావిస్తూ,. ప్రజల్లో సింపతీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక అల్మోస్ట్ జనసేన కూడా ఇదే సింపతీ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్టీ స్థాపించి 10 ఏళ్ళు దాటిన ఇంతవరకు జనసేన ప్రభావం ఏపీలో కనిపించకపోగా, గత ఎన్నికల్లో అధినేత పవన్ రెండు చోట్ల ఓడిపోవడంతో ఈసారి ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. దాంతో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న పవన్ కొంతమేర సక్సస్ అవుతున్నారు కూడా. అయితే కేవలం పార్టీ బలపడితే సరిపోదు.. వచ్చే ఎన్నికల్లో జనసేన వైపు ప్రజలు చూడాలంటే అంతకు మించి చేయాల్సి ఉంటుంది. అందుకే పవన్ కూడా ప్రజా సింపతీని పొందే వ్యూహాన్నీ అమలు చేస్తూ ” ఒక్క అవకాశం.. ” అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో ” ఒక్క ఛాన్స్.. ” అంటూ సింపతీని బలంగా వాడుకొని, అధికారంలోకి వచ్చిన జగన్.. ఈసారి అంతకుమించి సింపతీ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. “ఒక్క జగన్ను ఓడించడానికి.. అందరూ కలిసిపోయారని “.. అయినప్పటికి ” తాను ఒక్కడినే పోరాడతానని.. తనకు ప్రజాబలం ” ఉందని జగన్ సింపతీ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ముందుకు వెలుతున్నారు. మరి ఈ మూడు పార్టీల అధినేతలు అనుసరిస్తున్న సింపతీ వ్యూహాలు ఈసారి ఎవరికి అనుకూలంగా మారనున్నాయి. అసలు ఈసారి ప్రజామద్దతు ఎవరికి ఉండబోతుంది అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికలవరకు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కొత్త వారికి నో ఛాన్స్.. కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

ఇదే చివరి ఎలక్షన్..నిజమేనా ? వ్యూహమా ?

ఒక్క ఛాన్స్ అంటున్న పవన్.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -