సలార్ పోస్టర్ రిలీజ్.. నిరాశలో ఫ్యాన్స్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ” సలార్ ” మూవీ అప్డేట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కే‌జి‌ఎఫ్ సిరీస్ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాలను నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. దాంతో ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ” సలార్ ” మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

గతంలో ఈ సినిమా ప్రారంభం అయినప్పుడు ఈ ఏడాది ఏప్రెల్ లో మూవీ విడుదల చేస్తామని చిత్రా యూనిట్ ప్రకటించినప్పటికి కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా గురించిన ఎలాంటి అప్డేట్ కూడా చిత్రయూనిట్ ఇవ్వలేదు. కానీ డార్లింగ్ అభిమానులను ఖుషీ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూవీ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఆ పోస్టర్ లో ప్రభాస్ ఊర మాస్ గా కనిపించాడు. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా వచ్చే ఏడాది ద్వితీయార్థంలోకి మూవీ వెళ్లిపోవడంతో డార్లింగ్ అభిమానులు కాస్త నిరాశకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీతో పాటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలు కూడా సెట్స్ పై ఉన్నాయి.

Also Read

మహేష్ – పవన్ ఫ్యాన్స్ మద్య మళ్ళీ మొదలైన రచ్చ !

రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?

కార్తికేయ-2 ఎలా ఉందంటే ..?

Related Articles

Most Populer

Recent Posts