Tuesday, April 30, 2024
- Advertisement -

త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు శిరుతాయ్‌ శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుందనే సంగతి గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం హీరో సూర్య నటిస్తున్న చిత్రం  ‘సూరారై పొట్రు’ పూర్తి కాగానే సూర్య శివ కాంబినేషన్ లో ని సినిమా సెట్స్ పైకి వెళ్లాలని భావించారు. అయితే ఆ సమయంలో దర్శకుడు శివ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న  ‘అన్నాత్తే’ సినిమాతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం లభించలేదు.

తాజాగా రజనీకాంత్  ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావడంతో దర్శకుడు శివ సూర్య సినిమా పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం సూర్య తన తదుపరి ప్రాజెక్ట్
వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివసల్‌’ అనే సినిమాలో నటించాల్సి ఉంది.

Also read:రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని… తర్వాత ఏమైందంటే..!

సూర్య ఈ రెండు చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాతనే శివ దర్శకత్వంలో సినిమా చేస్తారా లేక పోతే వీటితోపాటు గానే ఈ సినిమాను సెట్ పైకి తీసుకెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. శివ సూర్య కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మిస్తుండగా తాజాగా సోనీ లివ్‌ ఓటీటీ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరిందని కోలీవుడ్ సమాచారం.

Also read:బిగ్ బి పెద్ద మనసు.. ఏకంగా అంత పెద్ద సాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -