Saturday, April 27, 2024
- Advertisement -

దర్శకుడు శంకర్ కి భారీ షాకిచ్చిన లైకా..!

- Advertisement -

తమిళ దర్శకుడు శంకర్ సినిమా అంటే ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎంతో టెక్నాలజీని ఉపయోగించి సినిమాలను తెరకెక్కించడంలో శంకర్ కి ఎవరు సాటిరారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే శంకర్ కమల్ హాసన్ హీరోగా “భారతీయుడు 2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు 2018వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయలేదు.

ఈ క్రమంలోనే భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు శంకర్ కూడా కేవలం లైకా నిర్మాణ సంస్థ అలసత్వం వల్లే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

Also read:ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు

తెలుగులో రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించగా,హిందీలో రణబీర్‌సింగ్‌తో మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే లైకా సంస్థ ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న తమ సినిమా పూర్తి చేయకుండానే శంకర్ ఇతర సినిమాలు చేయడానికి వీలులేదని ఇటు తెలుగు ఫిలిం చాంబర్ కి,అటు హిందీ ఫిలిం ఛాంబర్ కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది, ఈ విషయంపై దర్శకుడు శంకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -