Friday, May 3, 2024
- Advertisement -

కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రం..!

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ ఆధీనంలో ఉన్న గనులు కేటాయిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం 6 నెలల్లోనే లాభాల్లోకి వస్తుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియని వారు కూడా రాజ్యాంగ పదవుల్లో ఉండటం దారుణమని వ్యాఖ్యానించారు. గనులన్నీ కాజేసి, ఇప్పుడేమో విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగం వీడియోను అయ్యన్నపాత్రుడు సామజిక మాధ్యమం లో విడుదల చేశారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు మొదట్నుంచీ చెబుతున్నామని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఎంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును.. ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకూడదని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం.. రాజకీయాలకు అతీతంగా పోరాడుదామంటూ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!

సంపూ హీరోగా ‘బజారు రౌడీ’ స్టిల్ అదుర్స్!

కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అరెస్ట్..చర్లపల్లి జైలుకు తరలింపు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -