Thursday, April 25, 2024
- Advertisement -

మా నాన్నని ఏరా.. ఒరేయ్ అంటా: జబర్దస్త్ నూకరాజు

- Advertisement -

బుల్లితెరపై ఎంతో పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ద్వారా కమెడియన్లు చేసే స్కిట్ లు పలు వివాదాలకు దారి తీస్తూనే ఉన్నాయి. తాజాగా గత ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, యాసను, తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మను కించపరుస్తూ స్కిట్ చేయడంతో ఈ విషయం కాస్త పోలీస్ కేసు వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే హైపర్ ఆది క్షమాపణలు కూడా తెలియజేశారు.

Also read:పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?

ఇదిలా ఉండగా వచ్చే వారం జరగబోయే ఎపిసోడ్ ఫాదర్స్ డే కావడంతో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమో లో పలువురు కమెడియన్లు వారి తండ్రులతో వచ్చి ఎంతో సందడి చేశారు. ఈ విధంగా ఈ షోకు తండ్రి కొడుకులు వచ్చి రచ్చ చేయగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి ఇంద్రజ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తన ఆటపాటలతో చిలిపి నవ్వులతో అందరిని ఆకట్టుకున్నారు.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

ఈ క్రమంలోనే ఈ ప్రోమోలో హైపర్ ఆది మాట్లాడుతూ తన నాన్నకు బంగారం అంటే ఎంతో ఇష్టమని.. ముందుగా తాను సంపాదించిన డబ్బులు అన్ని పోగుచేసి పది వేళ్ళకు 10 ఉంగరాలు కు, మెడలో రెండు చైన్లు పులిగోరు చేయించి ఇచ్చానని తెలిపారు. అదేవిధంగా కమెడియన్ నూకరాజు తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి గురించి మాట్లాడుతూ…”నేను నా తండ్రిని నాన్న అని పిలవడం కంటే ఒరేయ్.. ఏంట్రా.. ఏరా ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తానని చెప్పారు. తన తండ్రి కూడా తనని ఏంటి బ్రో అంటూ పలకరిస్తాడు అని తన తండ్రి గురించి తెలిపారు. ఈ విధంగా కమెడియన్లు వారి తండ్రి గురించి పంచుకున్న విషయాలకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు..ఇక వీరందరూ చేసిన సందడి చూడాలంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -