Thursday, March 28, 2024
- Advertisement -

కార్గిల్ లో జరిగే షెడ్యూల్ లో చైతూ.. ఏ మూవీ కోసమో తెలుసా ..!

- Advertisement -

తెలుగులో విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్నాడు చైతూ. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయకిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమా కూడా కరోనా షూటింగ్ నిలిచి పోయింది.

దీంతో నాగచైతన్య తాను బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా సెట్లోకి అడుగు పెట్టనున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ పడింది. కాగా ఇటీవల ముంబైలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అమీర్ ఖాన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ను కార్గిల్లో షూట్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్ లో నాగచైతన్యపై కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకు సంబంధించి డేట్స్ కూడా ఖరారు చేశారు. తెలుగు అగ్రహీరోలు అందరూ ఇటీవల బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్,రానా నేరుగా హిందీలో సినిమాలు చేస్తుండగా మిగతా హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య కూడా నేరుగా హిందీ సినిమాలో నటిస్తూ అక్కడ కూడా తన మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Also Read

ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి!

టక్​ జగదీశ్​ విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా?

త్వరలో శాకుంతలం షూటింగ్​ .. కీలక సన్నివేశాల చిత్రీకరణ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -