Friday, April 19, 2024
- Advertisement -

పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల మాఫియా నిత్యం జరుగుతూనే ఉంటుంది. గతంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సినీ తారలను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మరొక నటి తన బర్తడే పార్టీ సందర్భంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో తన స్నేహితులకు పార్టీ ఇస్తూ, మాదక ద్రవ్యాలు ఉపయోగించారన్న సమాచారం తెలియడంతో పోలీసులు హోటల్ పై దాడి చేసి నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె స్నేహితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

నైరా నేహాల్‌ షా పుట్టినరోజు కావడంతో నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి గోవాకు చెందిన తన స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మాదకద్రవ్యాలు సేవించారని సమాచారం పోలీసులకు అందడంతో వీరిని కస్టడీలోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరిద్దరికీ బెయిలు మంజూరు చేసింది.

Also read:ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!

ఈ విధంగా బర్తడే వేడుకలలో మాదకద్రవ్యాల వినియోగం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి మాదకద్రవ్యాలు ఎక్కడినుంచి వచ్చాయి, వీరికి ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వీరికి మాదకద్రవ్యాలను సరఫరా చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే నేహాల్‌ షా పలు బాలీవుడ్‌ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -