Friday, April 26, 2024
- Advertisement -

జబర్దస్త్ టీమ్ లీడర్ కు తీవ్ర అనారోగ్యం..?

- Advertisement -

బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ వేదికగా ఎంతోమంది నటులు తమలోని టాలెంట్ ని నిరూపించుకొని వెండితెరపై అద్భుతంగా రాణిస్తున్నారు.అలాగే జబర్దస్త్ షో కోట్లాది ప్రజల హృదయాల తాకి వారి ఆదరణ పొందుతోంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈషోలో కొన్ని రోజులుగా టీమ్ లీడర్ జిగేల్ జీవన్ కనిపించకపోవడంతో జబర్దస్త్ ప్రోగ్రాం ఫాలోవర్స్ మరియు అతని అభిమానులు నిరాశ చెందారు.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, అదిరే అభి ఓ సందర్భంలో జిగేల్ జీవన్ జబర్దస్త్ షోకు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు. టీమ్ లీడర్ జీవన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఐసియూ లో ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జీవన్ చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని ఆటో రాంప్రసాద్ తెలియజేస్తూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.

Also read:అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

జబర్దస్త్ టీమ్ లీడర్ జీవన్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటో స్పష్టంగా తెలియలేదు.జీవన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడని తెలియగానే జబర్దస్త్ టీమ్ లీడర్స్, అభిమానులు ఎంతో కలత చెందారు. జీవన్ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. అలాగే తమ అభిమాన కమెడియన్ క్షేమంగా తిరిగొస్తాడని,మళ్లీ జబర్దస్త్ వేదికపై నవ్వుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నారు.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -