సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

- Advertisement -

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కాన్సెప్ట్ లను తెరకెక్కిస్తూ విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన తొలి సినిమా ‘అ ‘ ను ఒక స్పెషల్ సినిమాగా మలిచి అందరినీ ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన కల్కి కూడా మెప్పించింది.ఆ తర్వాత తొలిసారిగా టాలీవుడ్ లో జాంబిల కాన్సెప్ట్ కథతో జాంబి రెడ్డి సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఒక ప్రత్యేక సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాతోనే బాల నటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా అరంగేట్రం చేశాడు. తేజ ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాలో కూడా తేజ ప్రధాన పాత్రలో నటించాడు. తేజను హీరోగా పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తాను తీస్తున్న మరో సినిమాలో అవకాశం కల్పించినట్లు టాక్.

- Advertisement -

ప్రశాంత్ వర్మ ఇండియాలోనే తొలిసారిగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు హనుమాన్ అని పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి ఓ చిన్న టీజర్ కూడా ఇప్పటికే విడుదల చేశాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయం తెలియజేయలేదు. అయితే ఇందులో కూడా తేజనే హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. తేజ, ప్రశాంత్ వర్మ సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. అందువల్లే మరోసారి తన సినిమాలో తేజను హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read

మా నాన్నని ఏరా.. ఒరేయ్ అంటా: జబర్దస్త్ నూకరాజు

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -