సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

- Advertisement -

సమంత నటించిన “ది ఫ్యామిలీ మెన్ 2” అమెజాన్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ద్వయం క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా తెలుగు వాళ్ళు ఎన్నో విజయవంతమైన కథల్ని అందిస్తూ మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేపడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ది ఫ్యామిలీ మెన్ 2 సక్సెస్ ఫుల్ అయిన సందర్భంగా ఓ మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్, ది ఫ్యామిలీ మెన్2 ఎంతో విజయవంతం కావడంతో దర్శకులు ‘ఫ్యామిలీమ్యాన్‌ 3’ కోసం కథ సిద్ధం చేస్తున్న రాజ్‌ అండ్‌ డీకే.. ఇందుకోసం వ్యువర్స్ నుంచి ఈ వెబ్ సిరీస్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ విధంగా ప్రేక్షకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని తర్వాత వాటిని సరిదిద్దుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Also read:కియారా అద్వానీ కిక్.. వైరల్ వీడియో!

ఈ సందర్భంగా ‘ఫ్యామిలీమ్యాన్‌ 2’ వర్కౌట్ కాని విషయాలలో సమంతను తెరపై చూపించిన విధానం ఒకటి. ఎక్కువమంది సమంత రంగు పై విమర్శలు కురిపించారు. అయితే ఈ విధంగా విమర్శలు వస్తాయని తమకు ముందే తెలుసని, ఏదైనా కొత్తగా ప్రయోగించినప్పుడు అది విఫలమైతే ఎందుకు అలా చేశారని అడగడం సర్వసాధారణమే, కానీ అది సక్సెస్ అయినా కూడా వదిలారని ఈ సందర్భంగా డీకే తెలిపారు. ఈ వెబ్ సిరీస్ విషయంలో మాకు ఒక ఐడియా, కాన్సెప్ట్ ఉందని దానిని మరింత అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా ఈ విధమైనటువంటి ఫీడ్ బ్యాక్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా వీరు తెలియజేశారు.

Also read:లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -