ప్రతి గురువారం,శుక్రవారం ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాం ఏంత ఫాపులర్ అయ్యిందో.. అంతే వివాదంలో చాలాసార్లు చిక్కుకుంది. ఈ షో ప్రసారాన్ని వెంటనే ఆపేయాలని కోరుతూ హైదాబాద్‌లోని బాలానగర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో మరి బూతులు ఎక్కువ అవ్వడంతోపాటు మహిళలు, చిన్న పిల్లల్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘జబర్దస్త్’ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్లలో అనైతిక దృశ్యాలు.. అసంబంధ, అశ్లీల పదాలను ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిని ఆ ఈటీవీ యాజమాన్యం కాని, ప్రోగ్రాం డైరెక్టర్ కానీ సెన్సార్ చేయడంలేదని ఆరోపించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ కార్యక్రమం ప్రసారమయ్యేందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని బాలానగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు మానవ హక్కుల సంఘంలోనూ దివాకర్ ఫిర్యాదు చేశారు.జబర్దస్త్’లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా.. ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పోలీసులకు, హెచ్ఆర్సీకి దివాకర్ విజ్ఞప్తి చేశారు. ‘జబర్దస్త్’తో పాటు ‘పటాస్’ కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు.ఈ రెండు ప్రోగ్రామ్స్ త్వరగా నిలిపివేయాలని దివాకర్ గట్టిగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం…
{loadmodule mod_sp_social,Follow Us}
Related