వాల్తేరు వీరయ్య అంతగా ఆకట్టుకోలేదా…

Megastar Chiranjeevi Waltair Veerayya Movie Twitter Review
Megastar Chiranjeevi Waltair Veerayya Movie Twitter Review

మెగాస్టార్ చిరంజీవి చాలరోజుల తరువాత వింటేజ్ మాస్ రోల్ లో నటిస్తున్న పక్కా కమర్షియల్ మూవీ ” వాల్తేరు వీరయ్య “. ఈ మూవీలో చిరుతో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికా సహా తెలుగు రాష్ట్రాల్లోను బెనిఫిట్ షోలు పడ్డాయి. సోషల్ మీడియాలో రివ్యూలు మొదలయ్యాయి.

మెగా అభిమానుల్లో భారీ అంచనాలుతో రిలీజ్ అయిన సినిమా అంతగా ఆకట్టుకోలేదనే టాక్ వస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటన విశ్వరూపం చూపించాడను ఫ్యాన్స్ చెప్పుతుంటే.. కథ విషయానికొస్తే రొటీన్ అయినప్పటికీ సాంగ్స్, ఫైట్స్, చిరంజీవి కామెడీ టైమింగ్, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఉన్నాయని బెనిఫిట్ షోలు చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.. సెకండాఫ్ కాస్త స్లోగా ఉంది… క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదని ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న అభిప్రాయం. మరో పక్క బాస్ డాన్స్‌, ఎన‌ర్జీ, యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ టాప్ అంటూ నెటిజ‌న్స్ రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని వార్తాలు

కమలిని ముఖర్జీ ఇప్పుడెలా ఉందంటే ?

బాలయ్య అభిమానుల్లో పూనకాలు లోడింగ్…

ఎన్టీఆర్ కోసం ప్లాన్ మార్చిన కొరటాల !