Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ ఈ మధ్యనే చెన్నైలో గ్రాండ్ గా జరిగింది, అక్కడ షూటింగ్ సవ్యంగా జరగలేదని యూనిట్ చెబుతున్నా ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలిసేలా చేయడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. కాగా సినిమా టీసర్ ని ముందు మే 28 న అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ రోజు రిలీజ్ చేయలేదు టీం.

కాగా ఆరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కారణంగా నిర్వహించే మహానాడు ప్రోగ్రామ్ కి ఎలాంటి అడ్డంకి రాకూడదని ఇలా చేశారని అంటున్నారు కొందరు. అందువల్లనే టీసర్ పూర్తిగా రెడీ అయ్యి ఉన్నా కూడా అర్ధాంతరంగా రిలీజ్ ని ఆపేశారట. కాగా ఇప్పుడు కొత్త డేట్ కోసం అన్వేషిస్తున్న జనతాగ్యారేజ్ టీం ఈ నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.

కాగా కొత్త డేట్ వచ్చే నెల రంజాన్ రోజున అని అంటున్నా అప్పుడు కాకుండా జులై 22 న ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. అదే వారంలో సినిమా ఆడియోని కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై కొన్నిరోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -