Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మైల్ స్టోన్ మూవీ.. బాలీవుడ్ బడా స్టార్ ను గట్టెక్కిస్తుందా..!

- Advertisement -

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే థియేటర్ల వద్ద పండగే. ఓ మోస్తరుగా ఉన్నా ఆయన నటించిన సినిమాలు రూ.వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. సినీ ఇండస్ట్రీలో మొదటి రూ.100 కోట్లు, రూ. 200 కోట్లు అత్యధికంగా రూ. వందకోట్ల క్లబ్ లో నిలిచిన సినిమాలు సల్మాన్ ఖాన్ నుంచి వచ్చినవే. అంతటి రేంజి ఉన్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.

సల్మాన్ చివరి చిత్రం రాధే ఓటీటీలో విడుదలై తీవ్ర విమర్శల పాలైంది. కొన్నేళ్ల కిందట తెలుగులో కూడా ఎన్టీఆర్ అలాగే వరుస ప్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ లు కొట్టిన ఎన్టీఆర్ మళ్లీ ఆ స్థాయి హిట్ సినిమా అందుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. మధ్యలో బృందావనం వంటి సినిమాలు వచ్చినా అది ఎన్టీఆర్ హిట్ స్థాయి కాదు. ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ కొరత తీరుస్తూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ ని మళ్లీ నిలబెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లో మరో మైల్ స్టోన్ గా నిలిచింది.

ఇప్పుడు బాలీవుడ్ లో వరస ఫ్లాపులు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ జనతా గ్యారేజ్ హిందీ లో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. తెలుగులో ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ హిందీలో ఈ సినిమాను సల్మాన్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సల్మాన్ ఖాన్ ను సంప్రదించగా ఆయన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఎన్టీఆర్ కు బ్రేక్ ఇచ్చిన జనతా గ్యారేజ్ సల్మాన్ ఖాన్ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి. రెడీ, కిక్, పోకిరి వంటి తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టిన సల్మాన్ మరోసారి జనతా గ్యారేజ్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Also Read

సలార్ మూవీలో వాణీ కపూర్..!

‘దృశ్యం’ రిజెక్ట్​ చేసిన రజనీకాంత్​? కారణం ఏమిటంటే?

మాస్ కా బాస్ ని ఎలా చూపించాలో అలా.. స్క్రిప్ట్ సిద్ధం చేసిన బాబీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -